గాయత్రి దేవి అలంకారంలో ఉన్న జగన్మాతను విజయవాడ మధ్య నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దర్శించుకున్నారు. ఉత్సవాల ఏర్పాట్లపై క్యూలో భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు విధులు బహిష్కరించిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే... ఈఓతో చర్చించారు. ఉత్సవాల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారికి ఆదేశించారు.
దుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు - విజయవాడ కనకదుర్గమ్మ
విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే మల్లాది విష్ణు దర్శించుకున్నారు. ఏర్పాట్లపై క్యూలో ఉన్న భక్తులను అడిగి తెలుసుకున్నారు.
దుర్గమ్మ సన్నిధిలో మల్లాది విష్ణు