కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. పలు గ్రామాల్లో పరిస్థితిని పరిశీలించారు. వరదతో కోతలకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వారికి కావల్సిన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పరంగా వరద బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు - Ministers
కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. బాధితులతో మాట్లాడి వారిక అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు