ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MINISTERS SUB COMMITTEE: 'పెండింగ్‌లో ఉన్న ఈనాం, ఎస్టేట్‌ భూముల కేసులు పరిష్కరించండి' - ఇనాం భూములపై మంత్రుల సబ్ కమిటీ బేటీ

ఈనాం, ఎస్టేట్ భూముల నిషేధిత చట్టాల ఉల్లంఘనులపై నమోదైన వివిధ కేసుల సత్వర పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. దీర్ఘకాలికంగా పెండింగ్​లో ఉన్న వివిధ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది.

పెండింగ్‌లో ఉన్న ఇనాం, ఎస్టేట్‌ భూముల కేసులు పరిష్కరించండి
పెండింగ్‌లో ఉన్న ఇనాం, ఎస్టేట్‌ భూముల కేసులు పరిష్కరించండి

By

Published : Sep 4, 2021, 4:05 PM IST

ఈనాం, ఎస్టేట్ భూముల నిషేధిత చట్టాల ఉల్లంఘనులపై నమోదైన వివిధ కేసుల సత్వర పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యింది. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ నేతృత్వంలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణలు ఈ సమావేశానికి హాజరయ్యారు. దీర్ఘకాలికంగా పెండింగ్​లో ఉన్న వివిధ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. 2013 వరకూ సర్వీసుదారులుగా ఉన్న వారికే ఈనాం భూములు చెందాలని.., కొత్తగా రైతువారీ పట్టాలు జారీ చేయకూడదంటూ జరిగిన చట్టసవరణపైనా మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. ఈనాం భూములు నిషేధిత జాబితా 22ఏ (సి) పరిధిలోకి వెళ్లటంతో తలెత్తిన వివాదాలను పరిష్కరించాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులకు సూచించింది.

పెండింగ్‌లో ఉన్న ఇనాం, ఎస్టేట్‌ భూముల కేసులు పరిష్కరించండి

గ్రామకంఠం భూముల్లో కబ్జాలో ఉన్నవారు, ఇళ్లు కట్టుకొని నివసిస్తున్న వారందరికి సర్వే చేసి అప్పగిస్తాం. మున్సిపాలిటీల్లోనూ సర్వేచేసి వారికి స్థలాలను అందిస్తాం. 2023 మార్చి నాటికి భూ సమస్యలను పరిష్కారించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. రాష్ట్ర మెుత్తం మీద ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. ఈ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి గారు యుద్ధ పత్రిపాదికన చర్యలు చేపడుతున్నారు. అందుకోసం మంత్రుల ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి

మరోవైపు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై కూడా మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. భూముల రీసర్వేలో ఉన్న సాంకేతికపరమైన ఇబ్బందులను తొలగించి సత్వరం ప్రాజెక్టును ప్రారంభించేలా చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రీసర్వే కోసం సర్వీసు ప్రొవైడర్లు, సాంకేతిక పరికరాల సరఫరాదారుల కోసం టెండర్లు పిలిచినట్లు అధికారులు వివరించారు.

ఇదీ చదవండి

IAS TRANSFERS: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

ABOUT THE AUTHOR

...view details