ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించిన మంత్రి వేణుగోపాల కృష్ణ - vijayawada latest news

జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించడానికి అవకాశం రావటం ఆనందంగా ఉందని బీసీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు.

Minister Venugopalakrishna launched the Jagananna Chododu scheme
జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించిన మంత్రి వేణుగోపాల కృష్ణ

By

Published : Nov 10, 2020, 5:01 PM IST

బీసీలను వెనకబడిన తరగతులుగా చూసే రోజుల నుంచి... బీసీ అంటే వెన్నెముక వర్గాలుగా సీఎం జగన్ భావిస్తున్నారని ఆ శాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు. బీసీ శాఖ మంత్రిగా జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించడానికి అవకాశం రావటం చాలా ఆనందంగా ఉందన్నారు మంత్రి. వైకాపా ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న ఈ పథకం నేటి నుంచి అమలవుతోందని స్పష్టం చేశారు.

విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రితో పాటు ఏపీ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఏనాదయ్య... సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొదటి విడతగా 2,57,040 మంది ఈ పథకానికి అర్హులుగా గర్తించి.. వారికి 247.04 కోట్ల రూపాయలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ పథకం వర్తింపజేయడంలో ఎవరి నుంచి ఎలాంటి సిఫార్సులు లేకుండా కేవలం అర్హత ఆధారంగా లబ్ది చేకూరుస్తున్నామన్నారు. జగన్‌ సీఎం అయిన తర్వాత 139 కులాలకు... 56 కార్పొరేషన్‌లను ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీని నిరారోగ్యశ్రీగా మార్చేసిందని మంత్రి విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details