వారం రోజులుగా కీలకమైన బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెడుతుంటే... ప్రతిపక్ష నేతలు ఎక్కడ ఉన్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. విజయవాడ నగరంలోని వైకాపా రాష్ట్ర కార్యాలయంలో మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50శాతం రిజర్వేషన్లు, భూ యజమానుల హక్కులు, లోకాయుక్త బిల్లులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. 40ఏళ్ల రాజకీయ అనుభవం చేయలేని పని... 40 ఏళ్ల వయసున్న సీఎం జగన్ చేస్తున్నారని పేర్కొన్నారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు.
'అసెంబ్లీలో కీలక బిల్లులు... ప్రతిపక్షం ఎక్కడ' - AP Education Minister
శాసనసభలో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు తెదేపా సభ్యులు అసెంబ్లీకి ఎందుకు రాలేదని... మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రశ్నించారు. ప్రజలు ప్రతిపక్షంలో ఎందుకు కూర్చోబెట్టారో తెలుసుకోవాలని తెదేపా ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
మంత్రి ఆదిమూలపు సురేష్