ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 3, 2021, 10:31 PM IST

ETV Bharat / city

'రాజ్యంగబద్ధ సంస్థలు దారితప్పితే చట్టసవరణలు చేయాల్సి ఉంటుంది'

ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోందని మంత్రి ఆదిమూలపు సురేశ్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన సంస్థలు దారితప్పితే చట్టసవరణలు చేయాల్సి ఉంటుందన్నారు.

రాజ్యంగబద్ధ సంస్థలు దారితప్పితే చట్టసవరణలు చేయాల్సి ఉంటుంది
రాజ్యంగబద్ధ సంస్థలు దారితప్పితే చట్టసవరణలు చేయాల్సి ఉంటుంది

రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన సంస్థలు దారితప్పితే చట్టసవరణలు చేయాల్సి ఉంటుందని మంత్రి ఆదిమూలపు సురేశ్ వ్యాఖ్యానించారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో గాయపడిన ఓ రాజకీయ వ్యక్తిని పరామర్శించేందుకు ఎస్ఈసీ వెళ్లటం దేనికి సంకేతమని మంత్రి ప్రశ్నించారు.

అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి భయపెట్టి పనులు చేయించుకుంటున్నారని మంత్రి విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం మేర స్థానాలు వైకాపా కైవసం చేసుకుంటుందన్నారు. ఎస్ఈసీ స్థానిక సంస్థల ఎన్నికలను ఓ పెద్ద సంచలనంగా మార్చేశారని మంత్రి సురేశ్ ఆక్షేపించారు.

ఇదీచదవండి:మంత్రుల సమక్షంలో రసాభాస.. బైరెడ్డి వర్సెస్ ఆర్థర్

ABOUT THE AUTHOR

...view details