ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Peddireddy: విద్యుత్ నష్టాలు తగ్గించేలా ప్రత్యేక దృష్టి సారించాలి: మంత్రి పెద్దిరెడ్డి - మంత్రి పెద్దిరెడ్డి న్యూస్

Minister Peddireddy Review: విద్యుత్ పంపిణీ నష్టాలు మరింతగా తగ్గాల్సిన అవసరం ఉందని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సచివాలయంలో ట్రాన్స్ కో విజిలెన్సు అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. విద్యుత్ చౌర్యం, అక్రమాలను అరికట్టేలా చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.

మంత్రి పెద్దిరెడ్డి
మంత్రి పెద్దిరెడ్డి

By

Published : May 17, 2022, 8:57 PM IST

Peddireddy On Power: విద్యుత్ చౌర్యం, అక్రమాలను అరికట్టేలా చర్యలు వేగవంతం చేయాలని ఏపీ ట్రాన్స్​ కో విజిలెన్స్ అధికారులకు ఆ శాఖ మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో ట్రాన్స్ కో విజిలెన్సు అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. విజిలెన్స్ విభాగం పటిష్ఠంగా ఉంటేనే విద్యుత్ చౌర్యం, దుర్వినియోగం, నష్టాలను నియంత్రించగలమని మంత్రి అన్నారు. అక్రమ విద్యుత్ వినియోగం, చౌర్యం, అనుమతి లేకుండా అధిక లోడ్​లను వినియోగించుకోవటం, మీటర్ల ట్యాంపరింగ్ తదితర అక్రమాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని సూచించారు. గృహ వినియోగంతో పాటు పారిశ్రామిక వినియోగంపై అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలన్నారు.

విద్యుత్ పంపిణీ నష్టాలు మరింతగా తగ్గాల్సిన అవసరం ఉందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఐఆర్డీఏ మీటర్ల బిగింపు, ఓవర్ లోడ్ సెక్షన్​లలో అదనపు ఫీడర్లు, అదనపు లోడ్ డిమాండ్ ఉన్నచోట్ల కొత్త డీటీఆర్​ల ఏర్పాటు వంటి చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు వ్యవసాయ విద్యుత్ స్మార్ట్ మీటర్లపై తెదేపా రైతులను తప్పుదోవ పట్టిస్తోందని మంత్రి మండిపడ్డారు. 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లలో ఎంత విద్యుత్ వినియోగిస్తున్నామో తెలుసుకునేందుకు మాత్రమే విద్యుత్ మీటర్లు బిగింపు జరుగుతోందన్నారు.

2021-22 ఆర్ధిక సంవత్సరంలో 5,31,140 విద్యుత్ సర్వీసులను తనిఖీ చేసినట్లు విద్యుత్ శాఖ అధికారులు మంత్రికి వివరించారు. అక్రమాలకు పాల్పడిన కేసులకు సంబంధించి రూ.131.90 కోట్ల జరిమానా విధించామని తెలిపారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details