ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జూన్ 8న 'స్వచ్ఛ సంకల్పం': మంత్రి పెద్దిరెడ్డి - స్వచ్ఛ సంకల్పం వార్తలు

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ సంకల్ప కార్యక్రమం నిర్వహణ కోసం 1,312 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. జూన్ 8 తేదీ నుంచి 90 రోజుల పాటు ఇందుకు సంబంధించిన విభిన్న కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్టు తెలిపారు.

జూన్ 8న 'స్వచ్ఛ సంకల్పం' కార్యక్రమం ఆవిష్కరిస్తాం: మంత్రి పెద్దిరెడ్డి
జూన్ 8న 'స్వచ్ఛ సంకల్పం' కార్యక్రమం ఆవిష్కరిస్తాం: మంత్రి పెద్దిరెడ్డి

By

Published : Jun 14, 2021, 1:33 PM IST

స్వచ్ఛ శంఖారావం (swachha shankaravam) పేరిట కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ చేపట్టాల్సిందిగా సర్పంచులకు మంత్రి పెద్దిరెడ్డి (peddireddy) సూచించారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల సర్పంచులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మంత్రి సమావేశమయ్యారు. జూన్ 8 తేదీన సీఎం జగన్ స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య లోపం వల్ల అంటు వ్యాధులు రాకూడదనే ఈ కార్యక్రమం చేపట్టినట్టు మంత్రి తెలిపారు. ఘనవ్యర్ధాల నిర్వహణ, తడిచెత్త, పొడిచెత్త సేకరణ, వనరుల సమీకరణ, ఇంకుడు గుంతల నిర్మాణం, ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ ఇలా వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి స్పష్టం చేశారు. మొత్తంగా జూన్ 8 తేదీ నుంచి 90 రోజుల పాటు ఈ కార్యక్రమాలు వరుసగా చేపట్టాల్సి ఉందని మంత్రి చెప్పారు. మరోవైపు సర్పంచులకు చెక్ డ్రాయింగ్ అధికారాలు ఇవ్వటంలో కొంత ఆలస్యమైందని మంత్రి వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details