విట్ ఏపీ ఆధ్వర్యంలో డేటా సైన్స్, అడ్వాన్స్ కంప్యూటింగ్ అంశంపై జాతీయ స్థాయిలో వర్క్‌షాప్ జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వర్చువల్‌గా హాజరయ్యారు. సమీప భవిష్యత్తులో డేటా అనలిటిక్స్ కీలకంగా మారనుందని ఆయన వ్యాఖ్యానించారు. డేటా సైన్స్ ఆధారిత రంగాల్లో నైపుణ్యం సంపాదించేలా ఆ తరహా అంశాలపై రాష్ట్రంలోనూ దృష్టి పెడతామని మంత్రి వెల్లడించారు.
డేటా సైన్స్ వర్క్‌షాప్‌కు వర్చువల్‌గా హాజరైన విద్యాశాఖ మంత్రి - adimulapu suresh latest news
సమీప భవిష్యత్తులో డేటా అనలిటిక్స్ కీలకంగా మారనుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. డేటా సైన్స్, అడ్వాన్స్ కంప్యూటింగ్ అంశంపై నిర్వహించిన జాతీయ స్థాయి వర్క్‌షాప్‌కు వర్చువల్‌గా మంత్రి హాజరయ్యారు.
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్
21వ శతాబ్ది ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకునేలా కొత్త అంశాలపై యువత నైపుణ్యం సంపాదించాలని మంత్రి సూచించారు. డేటా అనలిటిక్స్, అడ్వాన్స్ కంప్యూటింగ్, డేటా ఇంజినీరింగ్, బిజినెస్ అనలిటిక్స్, హెచ్ఆర్, సోషల్ మీడియా, మార్కెటింగ్, రిస్క్ అండ్ కంప్లైయన్స్, సప్లై చైన్ అనలిటిక్స్ రంగాలలో విస్తృతమైన అవకాశాలు ఉన్నట్టు మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి:కలెక్టర్‌పై వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు