ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Narayana Swamy: 'మద్యం ఆదాయ మార్గం కాదు..నియంత్రణకు కట్టుబడి ఉన్నాం'

మద్యాన్ని ఆదాయ మార్గంగా చూడటం లేదని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి (Dy CM Narayana Swamy) వెల్లడించారు. ప్రభుత్వం మద్యం నియంత్రణకు కట్టుబడి ఉందన్నారు.

ప్రభుత్వం మద్యం నియంత్రణకు కట్టుబడి ఉంది
ప్రభుత్వం మద్యం నియంత్రణకు కట్టుబడి ఉంది

By

Published : Sep 8, 2021, 8:10 PM IST

ప్రభుత్వం మద్యం నియంత్రణకు కట్టుబడి ఉంది

మద్యం నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి (Dy CM Narayana Swamy) స్పష్టం చేశారు. ప్రభుత్వమే మద్యం షాపులను (Liquor Shops) నిర్వహిస్తుంటే.. ఎమ్మెల్యేలు, మంత్రులు దోపిడీ చేశారని ప్రతిపక్షాలు ఎలా ఆరోపిస్తాయని మండిపడ్డారు. పక్క రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మద్యాన్ని ఆదాయ మార్గంగా చూడడం లేదని స్పష్టం చేశారు.

మద్యపాన నియంత్రణ గురించి ప్రభుత్వం (AP Government) ఆలోచిస్తుంటే..మద్య పానాన్ని కొనసాగించాలని తెదేపా (TDP) ఉద్యమం చేస్తోందని నారాయణ స్వామి ఆరోపించారు. చంద్రబాబు (Chandrababu) అధికారంలో ఉన్నప్పుడు బెల్టుషాపులకు విచ్చలవిడిగా అనుమతులిచ్చారన్నారు. మద్యం ద్వారా ఆదాయం లేకపోతే సంక్షేమ పథకాలు ఎట్లా అమలు చేస్తామని గతంలో చంద్రబాబు వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. మద్యం నియంత్రణలో భాగంగా 2,934 దుకాణాలకు తగ్గించామని.. ఏపీలో కొత్త దుకాణాలకు ఎక్కడా అనుమతులు ఇవ్వలేదన్నారు. మద్యం వెరైటీల గురించి తనకేమీ తెలియదని.. కేవలం మద్యం సేవించే వాళ్లకే బ్రాండ్లు తెలుస్తాయని ఎద్దేవా చేశారు. మద్యం దుకాణాల వద్ద క్యూలో నిలబడలేని వారి కోసమే వాక్​ఇన్ స్టోర్​లు (Walk In Store's) పెట్టామని మంత్రి వ్యాఖ్యానించారు.

ప్రభుత్వమే మద్యం షాపులను నిర్వహిస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు దోపిడీ చేశారని ప్రతిపక్షాలు ఎలా ఆరోపిస్తాయి. పక్క రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం. మద్యాన్ని ఆదాయ మార్గంగా చూడటం లేదు. ప్రభుత్వం మద్యం నియంత్రణకు కట్టుబడి ఉంది.- నారాయణ స్వామి, ఉపముఖ్యమంత్రి

ఇదీ చదవండి

chavithi celebrations: వినాయక చవితి ఉత్సవాలకు హైకోర్టు గ్రీన్​ సిగ్నల్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details