Telangana Minister KTR: అమెరికా పర్యటనలో ఉన్న.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ న్యూయార్క్‌లో కాసేపు సరదాగా గడిపారు. లెక్సింగ్‌టన్ ఏరియాలో ఫైజర్ సంస్థతో భేటీ తర్వాత బయటికొస్తూ స్ట్రీట్ ఫుడ్ చూసి మంత్రి ఆగారు. చికెన్ రైస్ ఆర్డర్ చేయించుకున్నారు. సాస్ కలుపుకుని తిన్నానని.. చాలా రుచిగా ఉందని ట్విట్టర్‌లో వెల్లడించారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. పెట్టుబడులను ఆహ్వానించడం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కల్పిస్తున్న ప్రోత్సాకాలను ఆయా సంస్థలకు వివరిస్తున్నారు.
అమెరికాలో స్ట్రీట్ ఫుడ్ టేస్ట్ చేసిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఏం తిన్నారంటే? - కేటీఆర్ వార్తలు
Telangana Minister KTR: పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో అమెరికా వెళ్లిన తెలంగాణ మంత్రి కేటీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. పలు సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. అయితే.. బిజీ షెడ్యూల్ లోనూ.. కేటీఆర్ కాసేపు సరదాగా గడిపారు.
అమెరికాలో స్ట్రీట్ ఫుడ్ తిన్న తెలంగాణ మంత్రి కేటీఆర్