ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: బండి సంజయ్​ ఆరోపణలను ఖండించిన మంత్రి కేటీఆర్​

హైదరాబాద్​ చార్మినార్​ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న సమయంలో తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ చేసిన వాఖ్యలపై మంత్రి కేటీఆర్​ మండిపడ్డారు. అవాస్తవ ఆరోపణలతో ఎన్నికల వేళ రాజకీయం చేయడం సబబు కాదన్నారు.

minister ktr condemns comments on cm kcr by bandi sanjay on ghmc elections
తెలంగాణ:బండి సంజయ్​ ఆరోపణలను ఖండించిన మంత్రి కేటీఆర్​

By

Published : Nov 20, 2020, 5:27 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్​కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చేసిన ఆరోపణలను మంత్రి కేటీఆర్​ ఖండించారు. చార్మినార్​ వద్దనున్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఆయన దర్శించుకున్నాక ముఖ్యమంత్రి కేసీఆర్.. తెరాసపై విమర్శలు గుప్పించారు.

జీహెచ్​ఎంసీ ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ వేళలో అసంబంధ, అవాస్తవ వ్యాఖ్యలు చేయడం తగదని మంత్రి కేటీఆర్​ అన్నారు. బండి సంజయ్​ చేస్తున్న అసత్య ప్రచారం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని కేటీఆర్​ విమర్శించారు. ఇలాంటి అవాస్తవ ఆరోపణలతో ఎన్నికల వేళ రాజకీయం చేయడం సరికాదని మంత్రి హెచ్చరించారు.

ఇదీ చదవండిః

సలాం కుటుంబాన్ని పరామర్శించిన సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details