రాష్ట్రప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. విత్తనాల కోసం రైతులు ఇకపై మండల కేంద్రాలకు వెళ్లే పనిలేదన్నారు. ఇక నుంచి గ్రామస్థాయిలోనే విత్తనాల పంపిణీ చేస్తామని తెలిపారు. దీనికోసం గ్రామవ్యవసాయ సహాయకుల వద్ద పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఈనెల 18న రాష్ట్రవ్యాప్తంగా విత్తనాల పంపిణీ ప్రారంభిస్తామన్న ఆయన... బత్తాయి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈనెల 18 నుంచి గ్రామస్థాయిలోనే విత్తనాలు పంపిణీ: మంత్రి కన్నబాబు - agriculture news
గ్రామస్థాయిలోనే విత్తనాలు పంపిణీ చేసే కార్యక్రమం ఈ నెల 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్లు వ్యవసాయ మంత్రి కన్నబాబు తెలిపారు.
మంత్రి కురసాల కన్నబాబు