ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతు భరోసా కేంద్రాల్లో సేవలు విస్తృతం చేయండి: మంత్రి కన్నబాబు - రైతు భరోసా కేంద్రాల్లో సేవలు విస్తృతం చేయండి: మంత్రి కన్నబాబు

వ్యవసాయానికి కావాల్సిన ఉత్పత్తులు మార్కెట్ ధర కన్నా నాణ్యమైన, తక్కువ ధరకు రైతులకు అందించేలా రైతు భరసా కేంద్రాలు పని చేయాలని అధికారులకు మంత్రి కన్నబాబు సూచించారు. రైతు భరోసా కేంద్రాల పనితీరు - వ్యవసాయ యాంత్రీకరణపై అధికారులతో ఆయన సమీక్షించారు. రైతులకు అందించే ఉత్పత్తుల్లో నాణ్యత తగ్గకుండా, త్వరితగతిన సేవలు అందించేలా ఆయా కంపెనీలను సన్నద్ధం చేయాలన్నారు.

రైతు భరోసా కేంద్రాల్లో సేవలు విస్తృతం చేయండి: మంత్రి కన్నబాబు
రైతు భరోసా కేంద్రాల్లో సేవలు విస్తృతం చేయండి: మంత్రి కన్నబాబు

By

Published : Jun 20, 2020, 8:29 PM IST

రైతు భరోసా కేంద్రాల పనితీరు - వ్యవసాయ యాంత్రీకరణపై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అధ్యక్షతన విజయవాడలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాల పనితీరు, ఇతర సాంకేతిక అంశాలపై అధికారులతో చర్చించారు. వ్యవసాయానికి కావాల్సిన ఉత్పత్తులు మార్కెట్ ధర కన్నా నాణ్యమైన, తక్కువ ధరతో రైతులకు అందించేలా కేంద్రాలు పని చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ కేంద్రాల్లో కొత్తగా పశుగ్రాసం, ఖనిజ లవణాలు మిశ్రమాలు, పశువుల దాణా తదితర వ్యవసాయ సంబంధిత ఉత్పత్తులు రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు.

రైతులకు అందించే ఉత్పత్తుల్లో నాణ్యత తగ్గకుండా, త్వరితగతిన సేవలు అందించేలా ఆయా కంపెనీలను సన్నద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. అగ్రోస్ సంస్థ నోడల్ ఏజెన్సీగా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు మరిన్ని సేవలు అందించాలన్నారు. కంపెనీలతో వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఒప్పందాలు చేసుకునేలా చూడాలని సూచించారు. నర్సరీ ఉత్పత్తులను కూడా ప్రోత్సహించాలని మంత్రి కన్నబాబు అధికారులకు ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details