'మోదీని అడిగే దమ్ముందా'
రాష్ట్రానికి మట్టి,నీరు ఇచ్చిన మోదీని ప్రశ్నించే దమ్ము జగన్కు లేదని జలవనరుల శాఖ మంత్రి దేవినేని మండిపడ్డారు. చంద్రబాబును ఎదుర్కోలేకే కేసీఆర్, మోదీ, ఓవైసీతో జత కట్టారని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మళ్లీ తెదేపానే గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
దేవినేని ఉమ, జలవనరుల శాఖ మంత్రి
జగన్ వెయ్యి కోట్లకు కేసీఆర్కు అమ్ముడు పోయారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు.చంద్రబాబును ఎదుర్కోలేకే కేసీఆర్, మోదీ, ఓవైసీతో వైకాపా అధినేత జతకట్టారని ధ్వజమెత్తారు.ఓటమి భయంతోనే ఓట్లు తొలగించారంటూ బురద జల్లుతున్నారని మంత్రి ఆరోపించారు. కేంద్రం నుంచి నిధులు రాకపోయినా పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నామనిస్పష్టం చేశారు. కడప జిల్లాకు, పులివెందులకు నీళ్ళు ఇచ్చి మాట నిలబెట్టుకున్నామని తెలిపారు.