స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో విజయవాడ నగరపాలక సంస్థ మరింత పురోగతి సాధించేందుకు ఇప్పటి నుంచే అడుగులు వేస్తోంది. 14వ ఆర్థిక సంఘం, కాలుష్య నియంత్రణ మండలి నిధులతో ఆధునిక పారిశుద్ధ్య యంత్రాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది.
వీటిని ఇందిరాగాంధీ మైదానంలో రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. నగరంలో ఎప్పటికప్పుడు చెత్త శుభ్రం చేసేందుకు... మురుగు కాల్వల్లోని వ్యర్థాలను తొలగించేందుకు ఇవి ఉపయోగపడతాయని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు.