ఈ నెలాఖరు తర్వాత అన్ని ప్రాంతాల్లోనూ పర్యాటక ప్రాంతాలు ప్రారంభమవుతాయని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రకటించారు. సాంస్కృతికశాఖ ద్వారా కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే ప్రముఖులు, స్మారక వ్యక్తుల జయంతి, వర్ధంతి నిర్వహిస్తామని.. మంత్రి తెలిపారు. కొవిడ్ కారణంగా రాష్ట్ర పర్యాటక శాఖకు నెలకు 10 కోట్ల రూపాయల చొప్పున రూ.60 కోట్లు నష్టం వచ్చిందని మంత్రి తెలిపారు.
వేర్పాటు ఉద్యమాలు రాకూడదనే... మూడు రాజధానులు: అవంతి
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో రాష్ట్రంలోని ఏడు చోట్ల ఏడు నక్షత్రాల హోటళ్లు నిర్మించేలా ప్రణాళిక చేపట్టామని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జూన్ 30వ తేదీ నాటికల్లా అన్ని పర్యాటక ప్రాంతాల్లోనూ పర్యాటకశాఖ హోటళ్లు మరమ్మతులు పూర్తి చేస్తామని వెల్లడించారు. పదేళ్ల తరువాత వేర్పాటు ఉద్యమాలు రాకూడదనే జగన్ మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయాన్ని తీసుకున్నారని వ్యాఖ్యానించారు.
minister-avanthi-srinivas-on-hotels
విశాఖలోని పారిశ్రామిక ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదం దురదృష్టకరమని మంత్రి అన్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఎంత నష్ట పరిహారాన్ని ఇచ్చినా.. లాభం లేదని అన్నారు. మరోవైపు పదేళ్ల తరువాత మళ్లీ వేర్పాటు ఉద్యమాలు రాకూడదనే జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: 'సచిన్ చేతిలో ఏమీ లేదు.. ఇదంతా భాజపా పనే'