రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యాకమిటీ ఎన్నికలు(school education committee elections) ప్రశాంతంగా ముగిశాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్(Minister Adimulapu Suresh) వెల్లడించారు. మొత్తం 46,609 పాఠశాలలకుగాను 44,237 పాఠశాలల్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగిందన్నారు. 19 వేల పాఠశాలల్లో కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. వివిధ కారణాలతో 2,372 పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా(elections postpone) పడ్డాయని వెల్లడించారు. తక్షణమే వాటిని కూడా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకారం అందించిన తల్లిదండ్రులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలల అభివృద్ధిలో కూడా నూతన కమిటీ సభ్యులు భాగస్వాములు కావాలన్నారు.
19 వేల పాఠశాలల్లో ఏకగ్రీవంగా విద్యా కమిటీలు: మంత్రి ఆదిమూలపు సురేష్ - Minister Adimulapu Suresh latest news
రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యా కమిటీ ఎన్నికలు(school education committee elections) ప్రశాంతంగా జరిగాయని మంత్రి ఆదిమూలపు సురేష్(Minister Adimulapu Suresh) తెలిపారు. 46,609 పాఠశాలలకు గాను 44,237 పాఠశాలల్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగిందన్నారు. వివిధ కారణాలతో 2,372 పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయని వెల్లడించారు.
మంత్రి ఆదిమూలపు సురేష్