ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ: మంత్రి పెద్దిరెడ్డి - Measures to replace 1,40 lakh Secretariat jobs: Minister Peddi Reddy

వాలంటీర్ల ఉద్యోగాలతో మొత్తం 3,65,561 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గతంలో ఏ సీఎం కూడా ఇంతస్థాయిలో ఉద్యోగ భర్తీకి నిర్ణయం తీసుకోలేదన్నారు. సీఎం జగన్ మాత్రం ధైర్యంగా ముందుకెళ్తున్నారని అన్నారు.

సచివాలయాలతో భారీ స్థాయిలో ఉద్యోగాలు : మంత్రి పెద్దిరెడ్డి

By

Published : Jul 22, 2019, 6:32 PM IST

సచివాలయాలతో భారీ స్థాయిలో ఉద్యోగాలు : మంత్రి పెద్దిరెడ్డి

గ్రామ సచివాలయాల్లో భారీ స్థాయిల్లో ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లు పంచాయతీరాజ్​ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 11,114 గ్రామ సచివాలయాలు, 3786 వార్డు సచివాలయాల ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మొత్తం 3,65,561 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సమారు 1.40 లక్ష సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. ఈ స్థాయిలో గతంలో ఏ సీఎం కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని... ముఖ్యమంత్రి జగన్ మాత్రం చాలా ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఎంపిక ప్రక్రియ అంతా డీఎస్సీ ద్వారా జరుగుతుందని ప్రకటించారు. పంచాయతీ రాజ్ శాఖ నుంచే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని తెలిపారు. నవరత్నాలు అమలు కావాలంటే వాలంటీర్ల ఉద్యోగాలు త్వరితగతిన భర్తీ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details