ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా.. ఎండీ రహుల్లా నామినేషన్ దాఖలు - మ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రహుల్లా నామినేషన్

వైకాపా ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా హఠాన్మరణంతో ఖాళీ అయిన స్థానానికి.. ఆమె కుమారుడు ఎండీ రుహుల్లా నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ ఉప కార్యదర్శి కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి రహుల్లా నామినేషన్ పత్రాలను అందజేశారు.

వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థి
వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థి

By

Published : Mar 10, 2022, 4:47 PM IST

వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రుహుల్లా శాసనసభ ఉప కార్యదర్శి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. వైకాపా ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా హఠాన్మరణంతో ఖాళీ అయిన స్థానానికి శాసన సభ్యుల కోటాలో ప్రస్తుతం ఎన్నిక నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఆ స్థానంలో కరీమున్నీసా కుమారుడు రహుల్లాను పార్టీ అభ్యర్థిగా సీఎం జగన్ ఎంపిక చేశారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి పీ.వీ. సుబ్బారెడ్డికి రహుల్లా నామినేషన్ పత్రాలను అందజేశారు.

నామినేషన్ దాఖలు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పి.గౌతంరెడ్డి తదితరులు ఉన్నారు.

గుండెపోటుతో మృతి..
కరీమున్నీసా మొదట వైకాపా కార్పొరేటర్​గా గెలుపొందారు. అనంతరం ఆమె సేవలను గుర్తించిన సీఎం జగన్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. గతేడాది నవంబర్ 19న ఆమె గుండెపోటుతో మృతి చెందారు. కరీమున్నీసా మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఆమె కుమారుడి పేరును వైకాపా సూచించింది.

ఇదీ చదవండి

MLC Candidate: వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా.. మహమ్మద్ రుహుల్లా

ABOUT THE AUTHOR

...view details