ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సికింద్రాబాద్​లో వింత.. గాడిదలకు వివాహం

ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవాలని సికింద్రాబాద్​ పరిధిలోని బోయిన్​పల్లిలో వింత ఆచారాన్ని పాటించారు. మనుషులకు ఏ విధంగా పెళ్లి చేస్తామో అదేవిధంగా రెండు గాడిదలను అలంకరించి దేవుడి సన్నిధిలో వాటికి వివాహం జరిపించారు.

గాడిదలకు వివాహం

By

Published : Jul 23, 2019, 5:06 PM IST

గాడిదలకు వివాహం

ఈ సంవత్సరం వర్షాలు బాగా కురవాలని సికింద్రాబాద్​ పరిధిలోని బోయిన్​పల్లిలో వింత ఆచారాన్ని పాటించారు. రెండు గాడిదలకు వివాహం జరిపించారు. ఇలా గాడిదలకు గుడి ఎదురుగా వివాహం చేస్తే వర్షాలు బాగా పడతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం అని నిర్వాహకులు తెలిపారు. బోయిన్​పల్లిలో డక్కలి సామాజిక వర్గానికి చెందిన కొన్ని కుటుంబాల వారు గత కొన్నేళ్లుగా వర్షాలు పడనప్పుడు గాడిదలకు వివాహం చేసే వారని... వెంటనే సమృద్ధిగా వర్షాలు కురిసేవని వారు తెలిపారు.

రెండు గాడిదలను తీసుకువచ్చి వాటిని పెళ్లికూతురు, పెళ్లి కొడుకు లాగా అలంకరించి నూతన వస్త్రాలు కట్టి ఊరేగింపుగా హరిజన బస్తి అమ్మవారి ఆలయం వద్దకు తీసుకొని వచ్చారు. అనంతరం రెండు గాడిదలకు పూలదండలు వేసి సాంప్రదాయ బద్ధంగా వివాహాన్ని జరిపించారు. సకాలంలో వర్షాలు కురవక రైతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అందుకే ఈ వినూత్న కార్యక్రమాన్ని చేస్తున్నామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details