హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో... పవన్‌కళ్యాణ్‌తో మండలి బుద్ధప్రసాద్, జొన్నవిత్తుల భేటీ అయ్యారు. మాతృభాష పరిరక్షణ కోసం పవన్ నడుంబిగించారని బుద్ధప్రసాద్ అభినందించారు. భాష మనుగడకు ఉద్యమించాల్సిన పరిస్థితులు ప్రభుత్వం కల్పించిందని ఆరోపించారు. ఈ సవాలును ధీటుగా ఎదుర్కొని జాతిని మేల్కొల్పాలని... భాషాభిమానులంతా ఒకే వేదికపైకి రావాలని బుద్ధప్రసాద్ కోరారు.
'మన నుడి-మన నది ఉద్యమానికి అంతా కలిసి రావాలి' - పవన్ కళ్యాణ్ మన నుడి మన నది న్యూస్
జనసేన అధ్యక్షుడు పవన్‌తో మండలి బుద్ధప్రసాద్, జొన్నవిత్తుల భేటీ అయ్యారు. పవన్‌కళ్యాణ్ 'మన నుడి-మన నది' ఉద్యమానికి మద్దతు తెలిపారు.
mandali buddhaprasad and jonnavitthula meets pawan kalyan
భాషాభిమానులంతా పవన్‌కళ్యాణ్‌తో కలసిరావాలని జొన్నవిత్తుల అన్నారు. మాతృభాష సంరక్షణకు పవన్ బలమైన సంకల్పంతో ఉన్నారని కొనియాడారు. భాష పరిరక్షణ, నదుల కాలుష్యం నివారణకు జనసేనాని కంకణం కట్టుకున్నారన్నారు. ప్రకృతి, భాషా ప్రేమికులు, పండితులు, కవులు కలసి రావాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: త్వరలో 'మన నుడి- మన నది' కార్యక్రమం: పవన్