కృష్ణా జిల్లాను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టారు. "నేను సైతం కృష్ణమ్మ శుద్ధి సేవలో" ద్వారా కృష్ణానదిని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దారు. తర్వాత మన విజయవాడ కార్యక్రమాన్ని ఎంచుకున్న అధికారులు... జిల్లా మొత్తాన్నీ ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు ముందడుగు వేశారు. ఈ రెండింటితో వచ్చిన ఫలితాలను గమనించిన నగరపాలక సంస్థ... "మనకృష్ణ" పేరుతో మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
"మనకృష్ణ"తో ప్లాస్టిక్ రహితంగా విజయవాడ..! - vijayawada latest news
విజయవాడ నగరపాలక సంస్థ "మనకృష్ణ" పేరుతో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేనుసైతం కృష్ణమ్మ శుద్ధి సేవలో, మన విజయవాడకు కొనసాగింపుగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా కాలువల ప్రక్షాళన, సుందరీకరణ చేపట్టనున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడలో ఉన్న కాలువలను ప్రక్షాళన చేస్తారు. ప్లాస్టిక్, చెత్తాచెదారం లేకుండా సుందరంగా తీర్చిదిద్దుతారు. "మనకృష్ణ" కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం అవసరమని కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. ఇప్పటికే అమలుపరిచిన రెండు కార్యక్రమాల వల్ల ప్లాస్టిక్ వినియోగం గణనీయంగా తగ్గిందని వివరించారు. రూ.400 కోట్లతో చేపట్టనున్న ఈ పథకానికి చట్టబద్ధత కల్పిస్తూ ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేశామన్నారు. ఈ మిషన్ విజయవంతం అయితే విజయవాడలోని ప్రధాన కాలువలు, గోదావరిలో కలిసే కెనాల్స్ స్వచ్ఛంగా మారడంతోపాటు గట్లు సుందరంగా తయారవుతాయని వివరించారు.
ఇదీ చదవండీ... భిన్నరూపాల్లో అమరావతి రైతుల ఆందోళనలు