ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'స్వరూపానంద విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు సరైనవే' - Malladi Vishnu comments swaroopananda

స్వరూపానంద స్వామి జన్మదినం విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు సరైనవేనని ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. శారదాపీఠం స్వామీజీ జన్మదిన వేడుకలపై 2016 లోనూ గత ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలిచ్చి అమలు చేసిందని దాన్నే తాము కొనసాగించామన్నారు.

Malladi Vishnu Clarifies over swaroopananda Issue
మల్లాది విష్ణు

By

Published : Nov 15, 2020, 2:42 PM IST

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి జన్మదినం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు సరైనవేనని వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. రాష్ట్రంలో పలు ప్రముఖ దేవాలయాల్లో స్వామివార్ల శేష వస్త్రాలు తీసుకెళ్లి.. స్వరూపానంద స్వామికి ఇవ్వాలని సూచించామని.. దీంట్లో తప్పేముందని ప్రశ్నించారు. శారదాపీఠం స్వామీజీ జన్మదిన వేడుకలపై 2016 లోనూ గత ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలిచ్చి అమలు చేసిందని దాన్నే తాము కొనసాగించామన్నారు.

గత ప్రభుత్వంలో చేసిన దాన్ని... తమ ప్రభుత్వం చేస్తే తప్పేముందని విష్ణు ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాలపై విమర్శలు చేస్తోన్న తెదేపా నేతలు 2016లో ఇచ్చిన ఆదేశాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని పీఠాల స్వామీజీలను రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తుందని.. స్వామీజీల పట్ల సాంప్రదాయాలు పాటిస్తుందని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. వరదల సమయంలో గిరిజనులకు సాయం సహా పలు సామాజిక సేవలు విశాఖ శారదాపీఠం చేస్తుందన్నారు. అలాంటి శారదా పీఠానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో, వేటిని తాకట్టు పెట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండీ... ఆ కుటుంబంపై విధి చిన్నచూపు... ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు

ABOUT THE AUTHOR

...view details