ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అతి తక్కువ విద్యుత్‌ వాడకం నమోదు

రాష్ట్రంలో గురువారం 126.97 మిలియన్‌ యూనిట్ల అతి తక్కువ విద్యుత్‌ వినియోగం నమోదైంది. సాధారణ విద్యుత్‌ వినియోగం కంటే ప్రస్తుత వినియోగం 28 శాతం తగ్గినట్లు అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో అతి తక్కువ విద్యుత్‌ వాడకం
రాష్ట్రంలో అతి తక్కువ విద్యుత్‌ వాడకం

By

Published : Apr 11, 2020, 7:00 AM IST

రాష్ట్రంలో గురువారం 126.97 మిలియన్‌ యూనిట్ల అతి తక్కువ విద్యుత్‌ వినియోగం నమోదైంది. సాధారణ విద్యుత్‌ వినియోగంతో పోలిస్తే ప్రస్తుత వినియోగం 28 శాతం తగ్గింది. ఫలితంగా గ్రిడ్‌ ఫ్రీక్వెన్సీ నిర్వహణకు సుమారు 3 వేల మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తిని అధికారులు నిలిపేశారు. ప్రస్తుతం గృహ, వ్యవసాయ విద్యుత్‌ వినియోగం మాత్రమే నమోదవుతోంది. దీనివల్ల లోడ్‌ ఒక్కసారిగా తగ్గితే ప్రత్యామ్నాయంగా సర్దుబాటుకు అవకాశం లేదు. విద్యుత్‌ వినియోగం పెరిగే కొద్దీ ఉత్పత్తి పెంచేలా విద్యుత్‌ శాఖ ప్రణాళికను రూపొందించింది.

ఇదీ చూడండి: విద్యుత్​ స్పాట్​ బిల్లింగ్​ నిలిపివేత

ABOUT THE AUTHOR

...view details