ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Anganwadi-Asha's Protest: వారి అరెస్టు అప్రజాస్వామికం..ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి: లోకేశ్

పాదయాత్రలో ఇచ్చిన హామీల‌ను నెరవేర్చాలని ఆందోళ‌న‌కి దిగిన అంగన్​వాడీ, ఆశా వర్కర్లను అరెస్టు చేయ‌టం వైకాపా అరాచ‌క‌పాల‌న‌కు నిద‌ర్శ‌న‌మ‌ని తెదేపా నేత నారా లోకేశ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముఖ్య‌మంత్రి త‌న మూర్ఖ‌పు బుద్ధిని మానుకుని, అంగన్​వాడీలు, ఆశా కార్య‌క‌ర్త‌ల‌కు ఇచ్చిన హామీలు నెరవేర్చటంతో పాటు వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు.

వారి అరెస్టు అప్రజాస్వామికం
వారి అరెస్టు అప్రజాస్వామికం

By

Published : Feb 22, 2022, 6:13 PM IST

అంగన్​వాడీ కార్య‌క‌ర్త‌లు, ఆశా వ‌ర్క‌ర్లు శాంతియుతంగా ఉద్య‌మిస్తే పోలీసుల్ని ప్ర‌యోగించి నిర్దాక్షిణ్యంగా అణ‌చి వేయ‌టం నిరంకుశ‌త్వ‌మేన‌ని తెదేపా జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. అంగ‌న్ వాడీ, ఆశా వ‌ర్క‌ర్ల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల‌ను నెరవేర్చాలని ఆందోళ‌న‌కి దిగిన అంగన్​వాడీ, ఆశా వర్కర్లను అరెస్టు చేయ‌టం అరాచ‌క‌పాల‌న‌కు నిద‌ర్శ‌న‌మ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అంగన్​వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇచ్చి, రిటైర్​మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. వేతనంతో కూడిన మెడికల్‌ లీవు, స‌ర్వీసులో ఉండి చనిపోయిన వారికి రూ.50 ల‌క్ష‌లు ప‌రిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు.

క‌రోనా స‌మ‌యంలో త‌మ ప్రాణాలు ప‌ణంగా పెట్టి విధులు నిర్వ‌ర్తించిన ఆశా వ‌ర్క‌ర్ల‌ని ఫ్రంట్‌లైన్ వారియ‌ర్స్‌గా గుర్తించిన ప్ర‌భుత్వం వారికి క‌నీసం మాస్కులు, చేతికి గ్లౌజులు, ఇతర రక్షణ పరికరాలు ఇవ్వ‌క‌పోవ‌టం దారుణమన్నారు. కొవిడ్-19 మెడిక‌ల్ టీంల‌తో కలిసి విధి నిర్వ‌హ‌ణ‌లో కొవిడ్ సోకి మ‌ర‌ణించిన ఆశా కార్య‌క‌ర్త‌ల‌కు ఎటువంటి ప‌రిహారం ఇవ్వలేదన్నారు. ఇకనైనా ముఖ్య‌మంత్రి త‌న మూర్ఖ‌పు బుద్ధిని మానుకుని, అంగన్​వాడీలు, ఆశా కార్య‌క‌ర్త‌ల‌కు ఇచ్చిన హామీలు నెరవేర్చటంతో పాటు వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. అంగ‌న్‌వాడీ, ఆశా కార్య‌క‌ర్త‌ల ఉద్య‌మానికి తెలుగుదేశం పార్టీ నుంచి సంపూర్ణ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని లోకేశ్ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details