ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వాలంటీర్ పోస్టులు వాళ్లకేనా..? విజయసాయిరెడ్డి వీడియో చూపిన లోకేశ్ - lokesh

జగన్​ స్కామ్​ స్టార్​ అని ట్విట్టర్​ వేదికగా నారా లోకేశ్​ ఆరోపించారు. గ్రామ వాలంటీర్ల స్కామ్​తో రూ.12 వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి తెరలేపారని మండిపడ్డారు.

లోకేశ్​

By

Published : Aug 12, 2019, 3:30 PM IST

Updated : Aug 12, 2019, 5:50 PM IST

జగన్​ గ్రామ వాలంటీర్ల స్కామ్‌తో రూ.12 వేల కోట్ల ప్రజాధనం దోపిడీకి తెర లేపారని నారా లోకేశ్​ ఆరోపించారు. జగన్​ స్కామ్​ స్టార్​ అని మరోసారి రుజువైందని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ వాలంటీర్లను నియమిస్తామని చెప్పి.. వైకాపా కార్యకర్తలకు ఉద్యోగాలు ఇస్తున్నారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. 4 లక్షల మంది వైకాపా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికే భారీ కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైకాపా కార్యకర్తల కోసం 10 లక్షల మంది ఉద్యోగాలు తీసేసి పొట్ట కొట్టారని లోకేశ్​ ఆరోపించారు.

జగన్​పై ట్విటర్​లో లోకేశ్​
Last Updated : Aug 12, 2019, 5:50 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details