మద్యపాన నిషేధంపై ముఖ్యమంత్రి జగన్ చేసిన ట్వీట్‌పై నారా లోకేశ్ స్పందించారు. మద్యం అమ్మకాలపై సీఎం ఒకదానితో ఒకటి పొంతనలేని ప్రకటనలు ఇచ్చారని చురకలంటించారు. ఒకవైపు మద్యంతో మానవ సంబంధాలు నాశనమైపోతున్నాయంటూనే.. మరోవైపు మద్యం అమ్మకాల బాధ్యత ప్రభుత్వానిదంటున్నారని ఎద్దేవా చేశారు. 'అసలింతకీ మీరేం చెప్పాలనుకుంటున్నారంటూ' ట్వీట్ చేశారు.
'మానవ సంబంధాలు నాశనమైతే ప్రభుత్వానిదే బాధ్యత!'
మద్యం అమ్మకాలపై అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు సీఎం గారూ'.. ఒకదానితో ఒకటి పొంతనలేని ప్రకటనలు ఎందుకిస్తున్నారు_లోకేశ్
'మానవ సంబంధాలు నాశనం.. అయితే ప్రభుత్వానిదే బాధ్యత!'