ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 24, 2020, 5:12 AM IST

ETV Bharat / city

లాక్​డౌన్ మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలి: బొత్స

కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన పారిశుద్ధ్య కార్యక్రమాలపై పురపాలక శాఖ అధికారులతో మంత్రి బొత్స సత్యనారాయణ చర్చించారు. అన్ని పట్టణాలు, నగరాల్లో కరోనా నివారణకు అవసరమైన రసాయనాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

మంత్రి బొత్స సత్యనారాయణ
మంత్రి బొత్స సత్యనారాయణ

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పురపాలక శాఖ అధికారులతో మంత్రి బొత్స సత్యనారాయణ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాధి వ్యాపించకుండా తీసుకోవాల్సిన పారిశుద్ధ్య కార్యక్రమాలపై చర్చించారు. కరోనా నివారణకు అవసరమైన రసాయనాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. రైతు బజార్లు, జనావాసాల్లో చేతులు శుభ్రం చేసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ... లాక్​డౌన్​ మార్గదర్శకాలను పకడ్బందీగా పాటించేలా ప్రజలను చైతన్యపరచాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు అవసరమైన మాస్కులు, గ్లౌజులు వంటి వాటిని సమకూర్చాలన్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రతిరోజూ ఫాగింగ్​ చేయాలని బొత్స అధికారులకు నిర్దేశించారు. వ్యక్తిగత పరిశుభ్రత, రక్షణ చర్యలపై ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించేందుకు వార్డు వాలంటీర్లను వినియోగించుకోవాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details