కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. లాక్డౌన్ సడలింపుతో విజయవాడలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ఇష్టానుసారం తిరుగుతున్నారు. ఈ క్రమంలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ.. సింగ్ నగర్ పోలీసులు అవగాహన కార్యక్రమం చేపట్టారు. సడలింపులు ఇచ్చిన ప్రాంతాల్లో పోలీసులు కాలినడకన తిరుగుతూ వినియోగదారులకు, స్థానికులకు కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
'లాక్డౌన్ సడలించినా.. జాగ్రత్తలు తప్పనిసరి'
లాక్డౌన్ సడలింపుతో విజయవాడలో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఇష్టానుసారం తిరగుతున్నారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తి గత జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
lock down
ఆయా ప్రాంతాల్లో జనసాంద్రతను అంచనా వేసేందుకు డ్రోన్ కెమెరాతో చిత్రీకరిస్తున్నారు. సడలింపులు ఇచ్చిన ప్రాంతాల్లో కొవిడ్ 19 ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయని.. సడలింపును దుర్వినియోగం చేయొద్దని ప్రజలకు సూచించారు. గుంపులుగా తిరగొద్దని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని సింగ్ నగర్ ఎస్ఐ సతీష్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి:9న సీఎం జగన్తో సినీ ప్రముఖుల సమావేశం
Last Updated : Jun 7, 2020, 5:14 PM IST