ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అసలు కథ నేడే ప్రారంభం.. తస్మాత్ జాగ్రత్త! - ఆన్​లాక్ ఇండియా తాజా వార్తలు

అసలు కథ ఇవాళ్టి నుంచే ప్రారంభం.. స్వీయ నియంత్రణ పాటించకపోతే.. మళ్లీ కంటైన్​మెంట్​ జోన్లకే.. కాటేసేందుకు కాచుకు కూర్చొంది కరోనా.. జాగ్రత్త. మీరూ సురక్షితంగా ఉండండి.. మీ ఇంట్లో వాళ్లను కాపాడుకోండి. ఆ బాధ్యత మీదే..!

lock down exemption in andhrapradesh
lock down exemption in andhrapradesh

By

Published : Jun 8, 2020, 10:09 AM IST

మెున్నటి వరకూ.. రెస్టారెంట్లు లేవు.. ఆలయాలు తెరుచుకోలేదు. ఇంట్లోనే ఉన్నాం. తాజా సడలింపులతో బయటకు వచ్చారో.. ఇక మీ పని అంతే.. క్వారంటైన్​కే. బయటకు వెళితే.. స్వీయ నియంత్రణ తప్పనిసరి. భౌతిక దూరం అనే ఆలోచన మస్తిష్కంలో తిరుగుతూ ఉండాలి. శానిటైజర్​ ఉపయోగించడం... అలవాటు కావాలి. కాస్త అదమరిచి ఉన్నా .. కరోనా భూతానికి చిక్కిపోతారు. నాకేమవుతుందిలే.. అనే నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలపైకి వస్తుంది. ఆలయాలు.. రెస్టారెంట్లలో ఎగబడి.. ఒకరిపైకి ఒకరు వెళ్లకండి.. భౌతిక దూరంతోపాటు.. మాస్క్​లు ధరించండి. మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే.. మీ చుట్టూ ఉన్న సమాజాన్ని రక్షించాల్సిందీ మీరే. ఇన్ని రోజులు పాటించిన జాగ్రత్తలు మరికొద్ది రోజులు పాటించి అందరూ సురక్షితంగా ఉండండి.

మాస్క్ ధరించండి.. దూరం పాటించండి

ABOUT THE AUTHOR

...view details