ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గన్నవరం ఎమ్మెల్యే వంశీకి చేదు అనుభవం! - వల్లభనేని వంశీ వివాదాస్పద వార్తలు

కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్​ను ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరవకుండా.. మల్లవల్లి గ్రామస్థులు అడ్డుకున్నారు. బాపులపాడు మండలం మల్లవల్లిలో ఇళ్ల పట్టాల పంపిణీకి వెళ్లిన ఆయనకు వ్యతిరేకంగా.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

vallabhaneni vamsi
గన్నవరం ఎమ్మెల్యే వంశీకి చేదు అనుభవం..

By

Published : Dec 29, 2020, 12:30 PM IST

గన్నవరం ఎమ్మెల్యే వంశీకి చేదు అనుభవం..

కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌కు చేదు అనుభవం ఎదురైంది. బాపులపాడు మండలం మల్లవల్లిలో ఎమ్మెల్యేను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే వంశీని వెనక్కి వెళ్లాలంటూ నినాదాలు చేశారు.

రోడ్డుపై బైఠాయించి గ్రామస్థులు అడ్డుకున్నారు. మల్లవల్లిలో పోలీసులు భారీగా మోహరించారు. వంశీ వేదిక వద్దకు వెళ్లకుండానే వైకాపాలోని ఓ వర్గం అడ్డుకుంది. ఎమ్మెల్యే వంశీ అనుకూల, వ్యతిరేక వర్గాల నినాదాలతో మల్లవల్లిలో ఉద్రిక్తత నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details