ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలైన ఛత్తీస్‌గఢ్ సహా తెలంగాణా ఇతర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతూనే ఉంది. మరో రెండ్రోజుల్లో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడనం మధ్య భారతావనిపై కొనసాగనున్నట్లు వాతావరణ కేంద్రం తెలియచేసింది. వీటి ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రతో పాటు, రాయలసీమ జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు జల్లులు పడతాయని అంచనా వేస్తున్నారు.
గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 21 చోట్ల తేలికపాటి వర్షపాతం నమోదైంది. ఈ ప్రాంతాల్లో 2.5 నుంచి 15 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. మరో 302 చోట్ల ఒక మిల్లీ మీటరు నుంచి 2.4 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసిన్నట్లు వాతవరణ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలు
ప్రాంతం మిల్లీ మీటర్లు
కర్నూలు జిల్లా రుద్రవరం 7
తూర్పుగోదావరి ముమ్మిడివరం 6.5
కడప జిల్లా వేంపల్లి 6.2
కర్నూలు జిల్లా కోసిగి 4.5
విశాఖపట్నం 5.5
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు
ప్రాంతం డిగ్రీల సెల్సియస్
విజయవాడ 31
విశాఖపట్నం 30
తిరుపతి 34
అమరావతి 35