ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

corona tests: కరోనా పరీక్షలెక్కడో ? ప్రజలకు తప్పని ఇక్కట్లు - corona updates in krishna district

విజయవాడలో కరోనా నిర్ధరణ పరీక్షలు ఎక్కడ చేస్తున్నారో తెలియక.. బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం, రైల్వే స్టేడియం, గుణదల బిషప్‌ అజరయ్య పాఠశాలలో కొవిడ్‌ పరీక్ష కేంద్రాలు ఎప్పుడూ కొనసాగుతాయని అధికారులు గతంలో ప్రకటించినా.. కొద్దిరోజులుగా ఇక్కడ వాటిని ఆపేశారు. ఇక్కడ పరీక్షలు చేస్తున్నారనుకొని.. కొవిడ్‌ అనుమానితులు వచ్చి.. నిరాశగా వెనుదిరుగుతున్నారు. చివరకు ప్రైవేట్​ పరీక్ష కేంద్రంలో పరీక్షలు చేయించుకుని వేలు.. చెల్లిస్తున్నారు.

corona cases in vijayawada
corona cases in vijayawada

By

Published : Jul 30, 2021, 10:58 AM IST

కరోనా పరీక్షలు ఎక్కడ చేస్తున్నారో తెలియక ప్రజలు ఇక్కట్లు..

విజయవాడలో కొవిడ్ నిర్ధరణ పరీక్షా కేంద్రాలు ఎక్కడో తెలీక చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. గతంలో ఇందిరాగాంధీ స్టేడియం, రైల్వే స్టేడియం, బిషప్ అజరయ్య స్కూల్‌లో పరీక్షలు నిర్వహిస్తుండేవారు. ప్రస్తుతం ఎక్కడో తెలియటం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ జ్వరాలు పెరుగుతున్నాయి. జ్వరం వచ్చిందంటే చాలు.. ముందుగా కొవిడ్‌ పరీక్ష చేయించుకోమని వైద్యులు సూచిస్తున్నారు. ఆ తర్వాతే ఆసుపత్రులకు రావాలంటున్నారు.

కృష్ణా జిల్లాలో కొవిడ్‌ కేసులు నిత్యం 200 నుంచి 300 వరకు నమోదవుతున్నాయి. రోజూ కనీసం ఇద్దరి నుంచి ఐదుగురి వరకు వైరస్‌ బారినపడి చనిపోతున్నారు. కానీ.. కరోనా నిర్ధరణ పరీక్ష కేంద్రాలను మాత్రం ఎక్కడా కొనసాగించడం లేదు.

విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు గుడివాడ, నూజివీడు, మచిలీపట్నం డివిజన్ల పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు అధికంగా వస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కొన్నిచోట్ల మాత్రమే కొవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించిన శాంపిళ్లను పరీక్షల కోసం విజయవాడ సహా జిల్లాలో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లకు పంపుతున్నారు. కొవిడ్‌ నిర్ధరణ పరీక్షల కోసం ల్యాబ్‌లో పనిచేసే వైద్య సిబ్బందిని పెద్ద సంఖ్యలో నియమించారు. ప్రస్తుతం వీరందరూ అందుబాటులో ఉన్నా.. పరీక్షల కేంద్రాలను మాత్రం కొనసాగించకపోవడంతో... వీరికి కూడా పెద్దగా పనిలేకుండా పోయింది. కొవిడ్​ పరీక్షా కేంద్రాలు అందుబాటులో ఉంచాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఎలాంటి మార్పులు కనిపించినా వెంటనే కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకుని సకాలంలో వైద్య సేవలు పొందడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నాలుగైదు రోజుల పాటు జ్వరంతో బాధపడుతూ.. రక్త పరీక్షల్లో టైఫాయిడ్‌, డెంగీ అని వచ్చినా కొవిడ్‌ పరీక్ష చేయించుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాంటిది కొవిడ్​ పరీక్షా కేంద్రాలు లేక పోతే ఎలా పరీక్షలు చేయించుకోవాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి త్వరితగతిన పరీక్షా కేంద్రాలు ఏర్పాడు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు.

కరోనా నిర్ధారణ పరీక్ష కేంద్రాలు కరవవ్వడంతో ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లకు కాసుల పంటగా మారింది. ఏ అనారోగ్య సమస్య వచ్చినా ముందుగా కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకుని రావాలంటూ వైద్యులు సూచిస్తున్నారు. జ్వరం నుంచి కాళ్లు, కీళ్ల నొప్పుల వరకు అన్నింటికీ ఒకటే మంత్రం జపిస్తున్నారు. అప్పటివరకు చికిత్స అందించేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో అత్యవసర వైద్య చికిత్సల కోసం కరోనా నిర్ధారణ పరీక్షలకు బాధితులు పరుగులు తీస్తున్నారు. ఇదే అదనుగా విచ్చలవిడిగా ధరలు పెంచేసి వసూళ్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

current shock: గుంటూరు జిల్లాలో ఆరుగురు అనుమానాస్పద మృతి

ABOUT THE AUTHOR

...view details