అవి పేరుకు పల్లెలు.. కానీ నగర వాతావరణం కనిపిస్తుంది. మధ్యతరగతి ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికులు, చిరువృత్తులు చేసేవారు ఎక్కువ. బహుళ అంతస్తులతో కాంక్రీట్ జంగిల్‌లా ఉంటాయి. ఎప్పటినుంచో నగరంలో విలీనం కావాల్సిన గ్రామాలు. రాజకీయ కారణాలతో ఆగిపోయాయి. రాజధానికి ప్రధాన కేంద్రంగా ఉన్న విజయవాడలో శివారు గ్రామాల పట్టణీకరణ వేగంగా జరిగింది. ప్రస్తుతం విజయవాడ శివారు పంచాయతీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఒక పంచాయతీ ఏకగ్రీవం అయింది. తొలి విడతలోనే ఈ పంచాయతీలకు 9న పోలింగ్ జరగనుంది.
విడదీయలేని అనుబంధం..!
ఏలూరు రహదారిలో ఉండే రామవరప్పాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు, బందరు రహదారిలో ఉండే పెనమలూరు, పోరంకి, కానూరు, హైదరాబాద్ రహదారిలో ఉండే గొల్లపూడి, గుంటుపల్లి ప్రాంతాలను నగరంలో అంతర్భాగంగానే చాలామంది భావిస్తారు. మొత్తం 29 పంచాయతీలను విలీనం చేసి గ్రేటర్ విజయవాడగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు దస్త్రాలకే పరిమితమయ్యాయి. దీనికి విరుద్ధంగా యనమలకుదురు, కానూరు, పోరంకి, తాడిగడపలను కలిపి వైఎస్సార్ తాడిగడప పురపాలక సంఘం ఏర్పాటు చేశారు. గొల్లపూడి పంచాయతీని విభజించి గొల్లపూడి, వైఎస్సార్‌నగర్, రామరాజ్యనగర్, జక్కంపూడి పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ 8 పంచాయతీలకు ఎన్నికలు లేవు. 9 పంచాయతీలు గన్నవరం పరిధిలో ఉన్నాయి. అక్కడ మారిన రాజకీయ సమీకరణాలు ఎవరికి మద్దతుగా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.
రామవరప్పాడు(బీసీ మహిళ): ఓటర్లు 19,213. గతంలో కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ వైకాపా మద్దతుదారులు ఇద్దరు పోటీలో ఉన్నారు. జనసేన మద్దతుదారులు పోటీ చేస్తున్నారు. తెదేపా సానుభూతిపరులు నామపత్రం వేయలేదు.
ప్రసాదంపాడు(బీసీ మహిళ): ఓటర్లు 15,646. గతంలో తెదేపా సానుభూతులు గెలుచుకున్నారు. ప్రస్తుతం తెదేపా వైకాపా కలిసి ఏకగ్రీవం చేయాలని ప్రయత్నించాయి. తెదేపా 10 వార్డుల్లో ఏకగ్రీవం అయింది. సర్పంచి పదవికి గంగారత్నం పేరు ప్రతిపాదించాయి. వైకాపాలో గంగాజ్యోతి నామపత్రం వేశారు. ఉపసంహరణకు ససేమిరా అన్నారు. దీంతో పోటీ అనివార్యం అయింది. గతంలో తెదేపాలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఏఎంసీ మాజీ ఛైర్మన్ కొమ్మా కోట్లు ప్రస్తుతం వైకాపా తరఫున చక్రం తిప్పుతున్నారు.
ఎనికేపాడు(జనరల్): ఓటర్లు 9,459. గతంలో తెదేపా సిట్టింగ్ స్థానం. ఆ పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతం. తెదేపా తరఫున వేసిన నామినేషన్ తిరస్కరణకు గురయ్యింది. మరో అభ్యర్థి ఉన్నారు. తెదేపా, వైకాపా, భాజపా
మద్దతుదారులు రంగంలో ఉన్నారు.