గుంటూరు జిల్లా కొప్పర్రు బాధితులు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో తెదేపా అధినేత చంద్రబాబును కలిశారు. మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ జడ్పీటీసీ బత్తిని శారద, తెదేపా నేతలు, బాధితులతో కలిసి చంద్రబాబుతో భేటీ అయి దాడి ఘటనపై చర్చించారు. వివరాలను అడిగి తెలుసుకున్న చంద్రబాబు.. పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వంలో బతకాలంటే భయం వేస్తోందని మాజీ జడ్పీటీసీ బత్తిని శారద ఆందోళన వ్యక్తం చేశారు.
KOPPARRU INCIDENT: చంద్రబాబును కలిసిన కొప్పర్రు బాధితులు - chandrababu latest updates
కొప్పర్రు బాధితులు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో తెదేపా అధినేత చంద్రబాబును కలిశారు. మాజీ మంత్రులు నక్కా ఆనంద్ బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ జడ్పీటీసీ బత్తిని శారద, తెదేపా నేతలు, బాధితులతో కలిసి చంద్రబాబుతో భేటీ అయి దాడి ఘటనపై చర్చించారు.
చంద్రబాబును కలిసిన కొప్పర్రు బాధితులు
తమ ఇంట్లో వైకాపా మూకలు గంటన్నర పాటు విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు. హత్యాయత్నం చేసిన వారిపై నామమాత్రపు బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు పెట్టారని విమర్శించారు. బాధితులైన తమపైనే కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరగకపోతే ప్రైవేట్ కేసులు వేస్తామని హెచ్చరించారు. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న హోంమంత్రే ఈ చర్యలను ప్రోత్సహించటం సరికాదన్నారు.
ఇదీ చదవండి: