వల్లభనేని వంశీకి చెప్పాల్సింది చెప్పామని.. ఇక నిర్ణయం ఆయన చేతుల్లోనే ఉందని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. రాజకీయంగా రాటుదేలాలంటే ఒత్తిళ్లు సహజమేనని పేర్కొన్నారు. వీరోచితంగా పోరాడి గెలిచి ఇప్పుడు వెన్ను చూపడం మంచిది కాదని నాని అభిప్రాయపడ్డారు. పారిపోవడం మొదలు పెడితే జీవితాంతం అదే పరిస్థితి వస్తుందన్నారు. వంశీకి తెలుగుదేశం ఎంత అవసరమో పార్టీకి ఆయన అవసరం అంతే ఉందని స్పష్టం చేశారు. వంశీ ఇంకా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలోనే ఉన్నారన్నారు.
'చెప్పాల్సింది చెప్పాం.. ఇక నిర్ణయం ఆయన చేతుల్లోనే' - కేశినేని నాని తాజా వార్తలు
రాజకీయాల్లో ఒత్తిళ్లు సహజమేననీ.. వాటిని తట్టుకుని నిలబడ్డప్పుడే గెలుస్తామని తెదేపా ఎంపీ కేశినేని నాని అన్నారు. పార్టీకి రాజీనామా చేసిన వంశీని కలిసి చెప్పాల్సింది చెప్పామనీ.. ఇక ఏ నిర్ణయం తీసుకుంటారో ఆయన ఇష్టమని పేర్కొన్నారు.
కేశినేని నాని, వల్లభనేని వంశీ