మా పథకాలను జగనే కాపీ కొడుతున్నారు: ఉప ముఖ్యమంత్రి - jagan
పింఛన్ పెంపు హామీతో మరోసారి తెదేపా పథకాలను జగన్ కాపీ కొడుతున్నారనే విషయం తేటతెల్లమైందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు.
నవ రత్నాలను మేము కాపీ కొట్టడం కాదు...జగనే మా పథకాలను కాపీ కొడుతున్నారని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అసెంబ్లీ లాబీలో వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం రూ.2 వేల వృద్ధాప్య ఫించన్ ఇస్తామంటే... రూ.3 వేలిస్తామంటూ జగన్ ప్రకటన చేయడం కాపీ కాదా అని ప్రశ్నించారు. ఉద్యోగ అర్హత వయస్సు గరిష్ఠంగా 45 ఏళ్లు ఉంటే ... జగన్ 45 ఏళ్ల నుంచే వృద్ధాప్య ఫించన్ ఇస్తే ఇక ఉద్యోగాలతో పనేం ఉంటుందన్నారు. కర్నూలు జిల్లాలో పార్టీ పరిస్థితి గురించి ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించామన్న అయన జిల్లాలో మెజార్టీ సీట్లు సాధిస్తామని చెప్పారు. కోట్ల కుటుంబం అడిగే సీట్ల విషయమై తమ మధ్య చర్చ రాలేదని కేఈ స్పష్టం చేశారు.