ప్రభుత్వ అవగాహన రాహిత్యంతోనే వరద కష్టాలు: కన్నా - kanna lakshmi narayana
వరదలతో ప్రజలు అవస్థలు పడటానికి ప్రభుత్వ అవగాహన రాహిత్యమే కారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
ప్రభుత్వ అవగాహన రాహిత్యం వల్లే ముంపు వచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విజయవాడ కృష్ణలంకలో ముంపునకు గురైన కాలనీల్లో ఆయన పర్యటించారు. గతంలో ముందుగానే వరద గురించి చెప్పే వారని.. స్థానికులు తమ విలువైన వస్తువులను కాపాడుకునే వారని తెలిపారు. కానీ ప్రస్తుతం వరద వచ్చాక ప్రభుత్వం అర్ధరాత్రి వేళ హటాత్తుగా ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాల వల్లే ప్రజలు కష్టాలు పడుతున్నారని విమర్శించారు. కరకట్ట నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.