తెదేపా, వైకాపాలు తమ పార్టీ బి-ఫారాలు దొంగిలించారని ఫిర్యాదు చేసినా పోలీసులకు పట్టించుకోలేదని...ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా అధినేత క్రైస్తవుడిగా ఉండి... తిరుమలకు వెళ్లి యాగాలు చేసినందువల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్నారు. జగన్ గతంలో తనపై హత్యాయత్నాలకు పాల్పడ్డారని ఆరోపించారు. జగన్ సీఎం కొడుకు అయితే ముఖ్యమంత్రి కావాలని ఉందా అని పాల్ ప్రశ్నించారు.
సీఎం కొడుకు... సీఎం కావాలని ఉందా!: కేఏ పాల్
వైకాపా అధినేత జగన్ గతంలో తనపై హత్యాయాత్నానికి పాల్పడ్డారని కేఏ పాల్ ఆరోపించారు.
విజయవాడలో కేఏ పాల్ మీడియా సమావేశం