రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్‌గా జస్టిస్ కనగరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అథారిటీ ఛైర్మన్ పదవిలో ఆయన మూడేళ్లపాటు కొనసాగనున్నారు. అథారిటీలో మరో ముగ్గురు సభ్యులను ప్రభుత్వం నియమించనుంది. జిల్లాస్థాయిలో పోలీస్ కంప్లైంట్స్ అథారిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
PCA CHAIRMAN: రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్‌గా జస్టిస్ కనగరాజ్ - జస్టిస్ కనగరాజ్ తాజా వార్తలు
15:19 June 20
పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఛైర్మన్‌గా జస్టిస్ కనగరాజ్
తమిళనాడుకు చెందిన జస్టిస్ కనగరాజ్‌ను..గతంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. అయితే అప్పటికే పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను అర్ధాంతరంగా తొలగిస్తూ జస్టిస్ కనగరాజ్‌ను నియమించడంపై పెద్ద వివాదం రేగింది. దీనిపై నిమ్మగడ్డ రమేశ్ న్యాయపోరాటం చేశారు. అన్ని అంశాలను పరిశీలించిన న్యాయస్థానం..నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను ఎస్ఈసీగా పునర్నియమిస్తూ అప్పట్లో ఆదేశాలు ఇచ్చింది. ఆ విధంగా నెలకు పైనే ఎస్ఈసీగా వ్యవహరించిన జస్టిస్ కనగరాజ్..మళ్లీ ఇప్పుడు రాష్ట్ర పోలీస్ కంప్లెయింట్స్ అథారిటీ ఛైర్మన్‌గా నియమితులయ్యారు.
ఇదీచదవండి
RRR LETTER: అమరావతిపై సరైన దృక్పథంతో ఆలోచించండి.. సీఎం సార్: రఘురామ