ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'జూడాలతో దురుసుగా ప్రవర్తించిన అధికారిపై విచారణ' - vijayawada cp

జూనియర్ వైద్యులతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావుకు వైద్య విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరిపిస్తామని సీపీ హామీ ఇచ్చారని జూడాలు తెలిపారు. వీఐపీ కదలికలు, ఇతర పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని ర్యాలీలకు అనుమతిస్తామని సీపీ తెలిపారు.

జూడాలతో దురుసుగా ప్రవర్తించిన అధికారిపై విచారణ : సీపీ తిరుమలరావు

By

Published : Aug 7, 2019, 9:42 PM IST

జూడాలతో దురుసుగా ప్రవర్తించిన అధికారిపై విచారణ : సీపీ తిరుమలరావు
జూనియర్ వైద్యుల ఆందోళన విరమింపజేసే క్రమంలో పోలీసులు అతిగా ప్రవర్తించారని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావుకు జూడాలు ఫిర్యాదు చేశారు. డీసీపీ మెడికోను కొట్టడంపై ఫిర్యాదు చేసిన వైద్య విద్యార్థులు... తమకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

సీపీ వివరణ
జూడాల భేటీ అనంతరం మాట్లాడిన సీపీ ద్వారకా తిరుమలరావు... అనుమతి లేకుండా ధర్నా చేయడం వలనే వైద్య విద్యార్థులను అదుపులోకి తీసుకున్నామని వివరణ ఇచ్చారు. పోలీసు నిర్బంధంలో ఉన్నవారిని విడుదల చేస్తామని, కేసులు నమోదైన వారిని బెయిలుపై విడిచిపెడతామని సీపీ అన్నారు. రేపట్నుంచి ర్యాలీలు నిర్వహించేందుకు జూడాలు అనుమతి కోరారన్న సీపీ... వీఐపీ కదలికలు, ఇతర పరిస్థితులను చూసి అనుమతి ఇస్తామన్నారు. జూడాల పట్ల దురుసుగా ప్రవర్తించిన అధికారిపై విచారణకు ఆదేశించామని సీపీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details