ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Jobs Recruitment in Telangana: ఊపందుకున్న నియామకాల ప్రక్రియ.. ఆటంకాలు లేకుండా భర్తీ చేసేందుకు కసరత్తు - ts news

Jobs Recruitment in Telangana: తెలంగాణలో భారీగా చేపట్టిన ఉద్యోగ నియామకాల ప్రక్రియకు ఆటంకాలూ లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. వేర్వేరు నియామక సంస్థల ద్వారా వీలైనన్నీ ఎక్కువ సంఖ్యలో నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రకటనలకు ముందే న్యాయ సలహా తీసుకోవాలని యోచిస్తోంది.

Jobs Recruitment in Telangana
ఊపందుకున్న నియామకాల ప్రక్రియ

By

Published : Mar 11, 2022, 10:26 AM IST

తెలంగాణలో ఊపందుకున్న నియామకాల ప్రక్రియ

Jobs Recruitment in Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఊపందుకుంది. 80 వేల ఖాళీల భర్తీకి ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. వేర్వేరు నియామక సంస్థల ద్వారా వీలైనన్ని ఎక్కువ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. వీటికి సంబంధించిన కీలక అంశాలపై సీఎస్​ సోమేశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించగా.. టీఎస్​పీఎస్సీ అధికారులతో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణా రావు భేటీ అయ్యారు. వివిధ అంశాలపైన సమాలోచనలు చేశారు. గతంలో నోటిఫికేషన్లపై వేసిన కేసులపై ప్రధానంగా చర్చించారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

విడివిడిగా నోటిఫికేషన్లు ఇవ్వాలనే యోచన

గతంలో నియామకాలకు సంబంధించి కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు సంబంధించిన 23 వేల పోస్టులు ఇలాంటి వివాదాల్లో ఉండటంతో నియామకాలు పూర్తికాలేదు. దీంతో కొత్తగా చేపడుతున్న ఉద్యోగాలకు ఇబ్బందులు ఎదురు కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. వీలైనంత తక్కువ సంఖ్యలో పోస్టులకు విడివిడిగా నోటిఫికేషన్లు ఇవ్వాలనే యోచిస్తున్నారు. మరోవైపు నోటిఫికేషన్ల జారీకి ముందే న్యాయసలహా తీసుకోవాలనే అంశంపై చర్చించారు. ఏకమొత్తంగా నోటిఫికేషన్ వెలువడితే కోర్టులో కేసువేస్తే ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయే వీలుంటుంది. అలా జరగకుండా వివిధ కేటగిరి పోస్టులకు విడివిడిగా ప్రకటనలు ఇస్తే కోర్టు కేసు పెడితే ఒకట్రెండు ఆగిపోయినా.. మిగిలిన వాటి ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా సీఎస్ అధ్యక్షతన గల రాష్ట్రస్థాయి నియామకాల కమిటీ ద్వారా కార్యాచరణను చేపట్టే వీలుంది.

ప్రత్యేక నియామక సంస్థల ద్వారా..

బుధవారం ప్రకటించిన ఉద్యోగాల్లో 27 శాఖలకు చెందినవి ఉన్నాయి. వీటిని జిల్లా, జోనల్, బహుళ జోనల్ పోస్టులుగా విభజించారు. పోలీసు నియామక మండలి ద్వారా హోంశాఖ పోస్టులు... డీఎస్సీ లేదా టీఆర్టీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలకు ప్రకటనలు వెలువడతాయని తెలుస్తోంది. వైద్యఆరోగ్య శాఖలకు ప్రత్యేక నియామక మండలి ఉండగా.... నీటిపారుదల శాఖ పోస్టులకు సైతం ప్రత్యేక నియామక మండలి ఏర్పాటు ఆలోచన ఉంది. జిల్లాస్థాయి పోస్టులను కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఎంపిక కమిటీలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. నోటిఫికేషన్లు జిల్లాల వారీగా విడుదల చేస్తారు. సంక్షేమ శాఖలు, ఇంజినీరింగ్ సర్వీసు పోస్టులన్నింటికి విడిగా ప్రత్యేక మండళ్లను ఏర్పాటు చేసి కేడర్ వారీగా నియామకాలు జరపాలనే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలించనుంది.

టీఎస్​పీఎస్సీ ద్వారా..

రాష్ట్రంలోని ప్రధాన నియామక సంస్థ టీఎస్​పీఎస్సీకి ఏయే బాధ్యతలు అప్పగించాలనే దానిపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రూప్‌-1, గ్రూప్‌ 2, గ్రూప్‌ 3, 4 నియామకాలు సర్వీసు కమిషన్ ద్వారా జరుగుతున్నాయి. ఈసారి ఆ పోస్టులను పూర్తిగా ఇవ్వాలా.. కొన్నింటిని జిల్లా ఎంపిక కమిటీలకు ఇవ్వాలనే దానిపైనా చర్చ జరిగింది.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details