ఎస్సీ, రెల్లి కార్పొరేషన్లకు ఎన్ని నిధులు కేటాయించారని ప్రభుత్వాన్ని జవహర్ నిలదీశారు. చర్మకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుందని, లిడ్ క్యాప్ స్థలాలను ఇళ్ల స్థలాలుగా ఎవరెవరికీ ఇచ్చారని ప్రశ్నించారు. బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్, అంబేడ్కర్ విదేశీ విద్య వంటివి ఎంతమందికి అందించారని జవహర్ అడిగారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన రుణాలెన్నని, అన్నింటికీ సమాధానం చెప్పాకే జగన్ తిరుపతిలో ఓట్లు అడగాలన్నారు.
నవరత్నాలు ఎక్కడ దాచారు?: జవహర్ - ఏపీ నవరత్నాలు న్యూస్
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఖర్చులపై లెక్కలు చెప్పాలని మాజీమంత్రి జవహర్ డిమాండ్ చేశారు. ఎస్సీ ఉపప్రణాళిక నిధులు దేనికి ఖర్చు పెట్టారు, నవరత్నాలు ఎక్కడ దాచారని ఆయన ప్రశ్నించారు.
నవరత్నాలు ఎక్కడ దాచారు?: జవహర్నవరత్నాలు ఎక్కడ దాచారు?: జవహర్