' వైకాపా విధానాల వల్లే కియా చూపు...ఇతర రాష్ట్రాల వైపు'
రాష్ట్రంలో సీఎం జగన్ అసమర్థ విధానాల వల్లే కియా పరిశ్రమ ఇతర రాష్ట్రాలకు తరలేందుకు సిద్ధమవుతోందని తెదేపా నేత బొండా ఉమా ఆరోపించారు. వైకాపా ప్రజాప్రతినిధుల దౌర్జన్యాల వల్లే కియా వెళ్లిపోవాలని ఆలోచించిదని.. రాయిటర్స్ సంస్థ ఇదే అంశాలను ప్రస్థావించిందన్నారు.
వైకాపా అసమర్థ ప్రభుత్వ విధానాల వల్లే కియా పరిశ్రమ ఇతర రాష్ట్రాల వైపు చూస్తుందని తెదేపా నేత బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. రాయితీలు ఇవ్వకపోవటం వల్లే తరలింపు దిశగా కియా అడుగులు వేసిందని వ్యాఖ్యానించారు. దిల్లీలో కియా ప్రతినిధితో మంత్రులు బలవంతంగా మాట్లాడించారని ఆరోపించిన బొండా... 17వేల యూనిట్ల కియా అనుబంధ సంస్థలను బెంగళూరులో నెలకొల్పారన్నారు. వైకాపా ప్రజాప్రతినిధుల దౌర్జన్యాల వల్లే కియా వెళ్లిపోవాలని ఆలోచించిదని..రాయిటర్స్ కూడా ఈ అంశాల గురించి రాసిందన్నారు.