'ప్రజాస్వామ్యంపై జగన్ దాడి' - CRITISIS
ప్రైవేటు కంపెనీపై తప్పుడు కేసులు పెట్టి తెదేపా కార్యకర్తల సమాచారాన్ని ప్రతిపక్ష నాయకుడు జగన్ తస్కరించారని ఉపముఖ్యమంత్రి కే.ఈ. కృష్ణమూర్తి ఆరోపించారు.
దోచుకోవడం, దాచుకోవడం.... వైకాపా అధినేత జగన్, అతని కుటుంబ సభ్యులకు అలవాటుగా మారిందని ఉప ముఖ్యమంత్రి కే.ఈ. కృష్ణమూర్తి విమర్శించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. ప్రైవేటు కంపెనీపై తప్పుడు కేసులు పెట్టి తెదేపా కార్యకర్తల సమాచారాన్ని జగన్ తస్కరించారన్నారు. ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం నిస్సిగ్గుగా పాలుపంచుకుందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమాచారాన్నిప్రైవేటు కంపెనీ తస్కరించిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఏపీ సమాచారం పోతే ప్రభుత్వం ఫిర్యాదు చేయాలి కానీ... ఎవరో ప్రైవేటు వ్యక్తి ఫిర్యాదు చేశాడం ఏంటని ప్రశ్నించారు.సేవా మిత్ర అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాప్ అని దీనిలో పార్టీ కార్యకర్తలు, వారికి అందుతున్న సంక్షేమ పథకాల సమాచారం మాత్రమే వుంటుందని పేర్కొన్నారు. పార్టీ సమాచారానికి, ప్రభుత్వ సమాచారానికి తేడా తెలియని వాళ్లు ప్రతిపక్ష నాయకులుగా ఉండడం మన దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. పబ్లిక్ డొమైన్ లో ఉన్న డేటాను ఎవరైనా వాడుకోవచ్చని గుర్తుచేశారు.జగన్ తీరు చూస్తుంటే తన మీద తనే నమ్మకం కోల్పోయినట్లు వుందని దుయ్యబట్టారు.