జిల్లా కలెక్టరేట్లను నోటిఫై చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు.. జడ్పీలపై కీలక నిర్ణయం - ఏపీ కొత్త జిల్లాలు
20:43 April 03
జిల్లా పరిషత్‌లు యథావిధిగా కొనసాగింపు
జిల్లా కలెక్టరేట్లను నోటిఫై చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు దృష్ట్యా కలెక్టరేట్లను నోటిఫై చేస్తూ సీసీఎల్ఏ, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు వెలువరించారు. నోటిఫై చేసిన చోట్ల నుంచి కలెక్టరేట్‌లు పనిచేస్తాయని ఆదేశాల్లో పేర్కొన్నారు. మరోవైపు జిల్లా పరిషత్‌లు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. జిల్లా పరిషత్‌ల పునర్విభజన లేదని.., 13 జిల్లా పరిషత్‌లు యథావిధిగా కొనసాగుతాయని నోటిఫికేషన్లో పేర్కొంది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణతో పరిషత్‌లపై ప్రభావం ఉండదని వెల్లడించింది. ప్రస్తుత జడ్పీలు పదవీకాలం ముగిసేవరకు అవే కొనసాగుతాయని స్పష్టం చేసింది.
- శ్రీకాకుళం కలెక్టరేట్ చిరునామా కొత్తపేట జంక్షన్‌గా నోటిఫై
- విజయనగరం కలెక్టరేట్ చిరునామా కంటోన్‌మెంట్‌గా నోటిఫై
- విశాఖ కలెక్టరేట్ చిరునామా మహారాణిపేటగా నోటిఫై
- పార్వతీపురం గిరిజన సంక్షేమ భవనం నుంచి మన్యం కలెక్టరేట్ కార్యకలాపాలు
- శంకరం గ్రామ పంచాయతీ నుంచి అనకాపల్లి కలెక్టరేట్ కార్యకలాపాలు
- పాడేరు నుంచి అల్లూరి సీతారామరాజు కలెక్టరేట్ కార్యకలాపాలు
- పాత కాకినాడ కలెక్టరేట్ నుంచి కాకినాడ కలెక్టరేట్ కార్యకలాపాలు
- అమలాపురం నుంచి కోనసీమ కలెక్టరేట్ కార్యకలాపాలు
- రాజమహేంద్రవరం నుంచి తూ.గో. కలెక్టరేట్ కార్యకలాపాలు
- ఏలూరులోని పాత కలెక్టర్ భవనం నుంచి ఏలూరు కలెక్టరేట్ కార్యకలాపాలు
- భీమవరం శ్రీచైతన్య కళాశాల నుంచి ప.గో. జిల్లా కలెక్టరేట్ కార్యకలాపాలు
- మచిలీపట్నం పాత కలెక్టరేట్ నుంచి కృష్ణా జిల్లా కలెక్టరేట్ కార్యకలాపాలు
- విజయవాడ సబ్ కలెక్టరేట్ నుంచి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యకలాపాలు
- నగరంపాలెం కలెక్టరేట్ నుంచి గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యకలాపాలు
- మానవవనరుల అభివృద్ధి కేంద్రం నుంచి బాపట్ల జిల్లా కలెక్టరేట్ కార్యకలాపాలు
- నరసరావుపేట జలవనరులశాఖ కార్యాలయ నుంచి పల్నాడు కలెక్టరేట్ కార్యకలాపాలు
- ఒంగోలు పాత కలెక్టరేట్ నుంచి ప్రకాశం జిల్లా కలెక్టరేట్ కార్యకలాపాలు
- నెల్లూరులోని పాత కలెక్టరేట్ నుంచి నెల్లూరు జిల్లా కలెక్టరేట్ కార్యకలాపాలు
- తిరుపతిలోని పద్మావతి నిలయం నుంచి తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యకలాపాలు
- చిత్తూరు పాత కలెక్టరేట్ నుంచి చిత్తూరు కలెక్టరేట్ కార్యకలాపాలు
- రాయచోటిలోని ప్రభుత్వ భవనం నుంచి అన్నమయ్య కలెక్టరేట్ కార్యకలాపాలు
- కడప కొత్త కలెక్టరేట్ సీ బ్లాక్ నుంచి కడప జిల్లా కలెక్టరేట్ కార్యకలాపాలు
- అనంతపురం పాత కలెక్టరేట్ నుంచి అనంతపురం జిల్లా కలెక్టరేట్ కార్యకలాపాలు
- పుట్టపర్తి సత్యసాయి సంగీత కళాశాల నుంచి సత్యసాయి జిల్లా కలెక్టరేట్ కార్యకలాపాలు
- కర్నూలు పాత కలెక్టరేట్ నుంచి కర్నూలు జిల్లా కలెక్టరేట్ కార్యకలాపాలు
- నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి కలెక్టరేట్ కార్యకలాపాలు
ఇదీ చదవండి:New Districts: ఏపీలో కొత్త జిల్లాలు.. తుది నోటిఫికేషన్ విడుదల