Independence Day రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సిద్ధమైంది. వేడుకల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి జగన్... జాతీయజెండా ఎగురవేయనున్నారు. ఆ తర్వాత సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా ప్రదర్శన కోసం వివిధ శాఖలకు చెందిన శకటాలను సిద్ధం చేశారు.
గుంటూరు జిల్లా చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో నిర్వహించే స్వాతంత్య్ర వేడుకల్లో... తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ఉదయం ఎనిమిదిన్నర గంటలకు జాతీయజెండా ఎగరవేస్తారు. అనంతం చంద్రబాబు ప్రసంగిస్తారు. స్వాతంత్య్ర సమరయోధుల ఆకాంక్షలు నెరవేర్చడమే మనందరి కర్తవ్యమని... హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన దేశాన్ని ప్రపంచానికే తలమానికంగా నిలబెట్టడమే జాతీయ వీరులకు మనం అర్పించే ఘన నివాళి అని అన్నారు.