Increasing crimes against women at AP: రాష్ట్రవ్యాప్తంగా నమోదైన అన్ని నేరాల్లో మహిళలపై దాడులు అత్యధికంగా పెరిగాయని డీజీపీ విడుదల చేసిన వార్షిక నేర గణాంక నివేదిక చెబుతోంది. మహిళలపై వేధింపుల నేరాలు 49.04 శాతం ఎక్కువయ్యాయి. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన ఘటనలూ 22.4 శాతం మేర పెరిగాయి. వరకట్న హత్యలు మాత్రమే తగ్గాయి. మహిళలపై అన్ని రకాల నేరాలు గతేడాది కన్నా ఈసారి 21 శాతం ఎక్కువయ్యాయి. ఈ ఏడాది నమోదైన మొత్తం కేసుల్లో14 శాతం మహిళలపై నేరాలకు సంబంధించినవే ఉన్నాయి.
Increased harassment on women: గతేడాది 511 అత్యాచారాలు జరిగితే ఈసారి 536 జరిగాయి. మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే కేసులు గతేడాది నమోదైన 5 వేల 225 నుంచి 2021లో 6 వేల 411కు పెరిగాయి. మొత్తంగా మహిళలపై వేధింపులకు సంబంధించి గతేడాది 6 వేల 319 కేసులు నమోదైతే ఈసారి 9 వేల 418 రికార్డయ్యాయి. పోక్సో చట్టం కింద నమోదైన కేసులు 18 వందల 2 నుంచి 2 వేల 97కు పెరిగాయి.