తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం బోల్లోనిచెరువు గ్రామంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయ నిర్మాణ పనుల్లో భాగంగా ధ్వజస్తంభం ఏర్పాటుకు క్రేన్ ఉపయోగించారు. కానీ ధ్వజస్తంభం బరువుతో క్రేన్ అదుపు తప్పి పక్కకు పడిపోయింది. ఈ ఘటనలో ఆలయం గోడ కూలింది.
ఆపరేటర్ చాకచక్యంగా దూకటం వల్ల స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. హనుమాన్ ఆలయం ఆవరణలో త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.